ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

ఐ జె యు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

మహబూబాబాద్ జిల్లా:-

మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమIMG-20260114-WA0083  ని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.


 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డు సర్కిల్ లో జర్నలిస్టుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ  నల్ల రిబ్బన్ లు...  ప్ల కార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు.
 అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా జర్నలిస్టు ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ....జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కే కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని వారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని లేనియెడల ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా తొర్రూరు ప్రింట్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు బిజ్జాల వెంకటరమణ, మేరుగు రమేష్, ఎనగందుల సంతోష్, లకావత్ యాదగిరి, ఇమ్మడి రాంబాబు, అంకం సురేష్, వీరాంజనేయులు, పంజాల శ్రీకాంత్, భాస్కర్ ,శ్రీకాంత్ దయాకర్, రామకృష్ణ ,విక్రమ్ మహేష్ ,కార్తీక్, రామ్మూర్తి, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.[

Read More డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!

Views: 56
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం