ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
ఫిబ్రవరి 3న ఉపసంహరణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని విడుదల
భద్రాది కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో ):తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 28 నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ 116మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ఖరారైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషన్ స్పష్టం చేసింది.షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణకు నిర్దిష్ట తేదీలను నిర్ణయించగా, పరిశీలన అనంతరం ఉపసంహరణకు కూడా అవకాశం కల్పించారు. ఓటింగ్ తేదీతో పాటు ఓట్ల లెక్కింపు తేదీని కూడా కమిషన్ వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినట్లు కమిషన్ పేర్కొంది. దీంతో మున్సిపల్ పరిధిలో కొత్తగా సంక్షేమ పథకాలు, బదిలీలు, నియామకాలు నిలిపివేయనున్నట్లు సమాచారం.ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.షెడ్యూల్ ప్రకటనతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి.

Comment List