స్థానిక యుద్దానికి మేం సిద్ధం
తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ భద్రాద్రి అధ్యక్షులు కట్ట సతీష్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ అన్నారు. కొత్తగూడెంలోని నందా తండాలో నూతన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రాబోయే కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు అశ్వరావుపేట, మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించి అన్ని స్థానాల్లో బహుజనులను గెలిపించేందుకు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ముందుకు వచ్చిందన్నారు. అణగారిన వర్గాల ప్రజలంతా ఏకతాటిపై వచ్చి ఐకమత్యంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులను కార్పొరేటర్, కౌన్సిలర్ లుగా గెలిపించుకుంటేనే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటుందన్నారు. బహుజన సిద్ధాంతంతో పోరాటం చేస్తేనే బహుజనుల రాజ్యాధికారం సాధ్యమవుతుందని కట్ట సతీష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూడ్ వీరన్న, యూత్ ప్రెసిడెంట్ గుగులోత్ పృథ్వి, సోషల్ మీడియా ఇంచార్జి కాకటి శ్రీకాంత్, మైనారీ సెల్ ప్రెసిడెంట్ కప్పల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comment List