ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

On
ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ

కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 9:కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగియడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ తేదీన జరగబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కొత్తగూడెం పట్టణ పరిధిలోని 33 డివిజన్లలో 34,000/- ల రూపాయల విలువగల 40 లీటర్ల మద్యాన్ని, 2,70,000/- రూపాయల విలువ గల 5.5 కేజీల ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ను ఉల్లంఘించినందుకు గాను మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని,110 కేసుల్లో 258 మంది సమస్యాత్మక వ్యక్తులను బైండోవర్ చేయడం జరిగిందని వివరించారు.33 డివిజన్లలోని 41 పోలింగ్ స్థానాలలో 110 పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఇందులో 65 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా,45 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు.ఓటర్లను ప్రలోవ్ పెట్టే విధంగా ఎవరైనా మద్యం నగదు ఇతరత్రా వస్తువులను సరఫరా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఎవరైనా శాంతిభద్రతలకు విగాథం కలిగించేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ సమావేశంలో సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు, ప్రతాప్, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక