తూచ్.. అంతా ఉత్తిదే..!
యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎవరు అంటే.. తానే అంటూ హింట్ ఇచ్చిన ప్రియాంక గాంధీ… 24 గంటలు దాటకముందే ఆ మాట మార్చేశారు. జస్ట్ జోక్ చేశానని తెలపడంతో నాయకులు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నానని, అధికారికంగా వారే సీఎం, వీరే సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదని ప్రియాంక అన్నారు. యూపీ సీఎం అభ్యర్థిని తానేనన్న ఊహల్లో ఉండొద్దని, ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని, ఆ విధులను […]
యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎవరు అంటే.. తానే అంటూ హింట్ ఇచ్చిన ప్రియాంక గాంధీ… 24 గంటలు దాటకముందే ఆ మాట మార్చేశారు. జస్ట్ జోక్ చేశానని తెలపడంతో నాయకులు నోరెళ్లబెడుతున్నారు.
ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నానని, అధికారికంగా వారే సీఎం, వీరే సీఎం అని చెప్పాల్సిన అవసరం లేదని ప్రియాంక అన్నారు. యూపీ సీఎం అభ్యర్థిని తానేనన్న ఊహల్లో ఉండొద్దని, ప్రస్తుతం తాను పార్టీ ప్రధాన కార్యదర్శినని, ఆ విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నట్లు ప్రియాంక తెలిపారు.
తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అయోమయంలో పడిపోయినట్లు కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ పార్టీకి అధికారం ఎలాగూ దక్కదనే సంకేతాలు వస్తున్నందునే ప్రియాంక మాట మార్చారని.. ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు సైతం… నోరు జారడం ఎందుకు ఆపై అభాసుపాలు కావడం ఎందుకంటూ ఒకింత అసంతృప్తికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List