సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
కొత్తగూడెం క్లబ్లో అరైవ్ అలైవ్ కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 24:కొత్తగూడెం క్లబ్లో మంగళవారం డి.ఎస్.పి ఆదినారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ, డిఎస్పి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని, చెడు మార్గంలో నడుచుకొని ఏదైనా పోలీస్ కేసు నమోదయ అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, వీసాలు పొందటానికి కోల్పోతారని తెలిపారు. ఎన్డిపిఎస్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అని అన్నారు. ఎవరైనా సైబర్ నేరం బారిన పడితే 1930 కి ఫోన్ చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి సివిక్స్ సెన్స్ అలవర్చుకోవాలన్నారు. మన ఇంటి వరకే కాదు సమాజానికి కూడా మన ద్వారా మార్పు రావాలన్నారు. ఇతర దేశాలలో బుల్లెట్ ట్రైన్ గంటకు 630 కిలోమీటర్ల వేగంతోని ప్రయాణిస్తు టెక్నాలజీ అభివృద్ధి చెందిందని తెలిపారు. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ మిమిక్రీ విద్యార్థులను అలరించింది. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రమణారెడ్డి, రమాదేవి, ప్రవీణ్ కుమార్, విజయ,ఉమా, కిషోర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comment List