అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో

On
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో

ఖమ్మం ఫిబ్రవరి 28 ఖమ్మం న్యూస్ ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్ అభినవ్ హై స్కూల్ లో శనివారం విద్యార్థుల నైపుణ్యాలకు అద్దం పట్టేలా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC), సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు.విద్యార్థులే ఉపాధ్యాయులుగా తాము నేర్చుకున్న అంశాలను తల్లిదండ్రులకు,అతిథులకు వివరించారు.ఈ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు.పాఠశాల డైరెక్టర్ అరుణ,కరస్పాండెంట్ రమణ ప్రదర్శనను వీక్షించారు. వారు మాట్లాడుతూ..విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా ఇలాంటి ప్రయోగాత్మక ప్రదర్శనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు అత్యంత నవీన పద్ధతులలో (ఇన్నోవాటివ్లీ ) సైన్స్ , మ్యాథ్స్,సోషల్ అంశాలపై అద్భుతమైన వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు.సాధారణంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు చెప్తారు కానీ ఇక్కడ విద్యార్థులే తాము ఏం నేర్చుకున్నారో తమ లక్ష్యాలేమిటో ఆత్మవిశ్వాసంతో వివరించడం అందరినీ ఆకట్టుకుంది.తమ పిల్లలు ఇంతటి ప్రతిభను కనబరచడం చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు . విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే ఈ ఎస్ ఎల్ సి ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కావ్య, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు .

IMG_20260228_224928

Views: 202
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..