స్కూల్ కు వెళ్లి వస్తుండగా చేనులోకి లాక్కెళ్లి..

On

స్కూల్ కు వెళ్లి వస్తుండగా చేనులోకి లాక్కెళ్లి.. విశాఖ జిల్లాలో స్కూల్ కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆ విద్యార్ధినికి అనుకోని సంఘటన ఎదురైంది. 11 ఏళ్ల మైనర్‌ బాలికపై అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేశు (22) అత్యాచారానికి పాల్పడ్డాడు.కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు.. నోరెత్తితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు..ఈ దారుణ ఘటన గురువారం రాత్రి విశాఖ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి […]

స్కూల్ కు వెళ్లి వస్తుండగా చేనులోకి లాక్కెళ్లి..
విశాఖ జిల్లాలో స్కూల్ కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆ విద్యార్ధినికి అనుకోని సంఘటన ఎదురైంది. 11 ఏళ్ల మైనర్‌ బాలికపై అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేశు (22) అత్యాచారానికి పాల్పడ్డాడు.కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు.. నోరెత్తితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు..ఈ దారుణ ఘటన గురువారం రాత్రి విశాఖ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి వంట చెరకు కోసం ఆమె సోదరి పక్కనే ఉన్న జీడితోటకు వెళ్లింది. ఆమెకు సహాయపడేందుకు బాధితురాలు కూడా తోటకు బయలుదేరింది. ఈ విషయం గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. బాలికను వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు. అంతేకాకుండా బాధితురాలి సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి తన మొబైల్‌కు పంపించాలని చెప్పాడు. అలా ఆ బాలికను నాలుగు గంటలపాటు చిత్రహింసలకు గురిచేశాక రాత్రి 9 గంటల సమయంలో తనే ఇంటి వద్ద వదిలివెళ్లాడు.

తమ చిన్న కుమార్తె కనిపించలేదని కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులు.. ఎట్టకేలకు ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె చెప్పిన విషయం విని వారి గుండెలు బద్దలైపోయాయి. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం సెక్షన్‌ 5 (ఎం), (హెచ్‌), ఆర్‌డబ్ల్యూ 6, సెక్షన్‌ 12 కింద, ఐపీసీ 376 (ఎఫ్‌), 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ నారాయణరావు తెలిపారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News