దూకుడు పెంచిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ ఫోకస్ చేసింది. జనవరి 7 న రాష్ట్రంలో 34,వేల 600 బూత్ కమిటీల తో ఓకె సారి వర్చుల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో […]
అసెంబ్లీ ఎన్నికల పై బీజేపీ ఫోకస్ చేసింది. జనవరి 7 న రాష్ట్రంలో 34,వేల 600 బూత్ కమిటీల తో ఓకె సారి వర్చుల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు యేడాది మాత్రమే గడువు ఉండటంతో..పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు బీజేపీ నేతలు.
అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బండిసంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐదో విడత పాదయాత్ర కొనసాగిన తీరుపై చర్చించారు.
దాంతోపాటు ఆరో విడత ప్రజాసంగ్రామయాత్రను హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించాలని, ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని కోర్‌కమిటీలో నిర్ణయించారు.
సమావేశంలో నేతల మధ్య సమన్వయం, కార్యక్రమాల నిర్వహణపై పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ దిశానిర్ధేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఇక బీజేపీ పార్టీ పదాధికారుల సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాష్ట్రంలో బూతు స్థాయి కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయవద్దని
పదాధికారుల సమావేశంలో తరుణ్ చుగ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టాలని జాయినింగ్స్ కమిటీ సభ్యులకు సూచించారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List