అఫ్గానిస్థాన్‌ అంతే..!

On

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులకు అడుగడుగునా అడ్డుతగులుతోంది. ఇప్పటికే ఉద్యోగినులు, పాఠశాలలకు వెళ్లే బాలికలపై ఆంక్షలు పెట్టిన తాలిబన్లు.. కొద్దిరోజుల క్రితం విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. దీంతో అఫ్గానిస్థాన్‌ చర్యలను యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ తప్పుబట్టింది. ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని తాలిబాన్లను కోరింది. దేశంలో బాలికలకు హైస్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అందకుండా నిషేధం విధించడంపై యూఎన్‌‌‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌ ఆందోళన వ్యక్తంచేసింది. అఫ్గానిస్తాన్‌‌‌‌లో మహిళలు, బాలికలకు సమానమైన హక్కులు కల్పించాలని పిలుపునిచ్చింది. మహిళా విద్యపై నిషేధం […]

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులకు అడుగడుగునా అడ్డుతగులుతోంది.

ఇప్పటికే ఉద్యోగినులు, పాఠశాలలకు వెళ్లే బాలికలపై ఆంక్షలు పెట్టిన తాలిబన్లు.. కొద్దిరోజుల క్రితం విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు.

దీంతో అఫ్గానిస్థాన్‌ చర్యలను యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ తప్పుబట్టింది. ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని తాలిబాన్లను కోరింది.

దేశంలో బాలికలకు హైస్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ అందకుండా నిషేధం విధించడంపై యూఎన్‌‌‌‌ సెక్యూరిటీ కౌన్సిల్‌‌‌‌ ఆందోళన వ్యక్తంచేసింది.

అఫ్గానిస్తాన్‌‌‌‌లో మహిళలు, బాలికలకు సమానమైన హక్కులు కల్పించాలని పిలుపునిచ్చింది.

మహిళా విద్యపై నిషేధం విధిస్తే సామాజికంగా, ఆర్థికంగా ఏ దేశమూ అభివృద్ధి చెందదని యునైటెడ్​ నేషన్స్ పేర్కొంది.

మహిళలు ప్రభుత్వయేతర సంస్థల్లో పనిచేయకుండా నిషేధించే నిర్ణయాలు భవిష్యత్తులో భయంకర పరిణామాలకు దారితీస్తాయని హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ యూఎన్‌‌‌‌ హైకమిషనర్‌‌‌‌‌‌‌‌ వోల్కర్‌‌‌‌‌‌‌‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మహిళలు, బాలికలపై విధించిన ఆంక్షలు అఫ్గాన్‌‌‌‌ వాసుల బాధలు పెంచడమే కాకుండా, వారు దేశం విడిచిపెట్టి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ యూఎన్‌‌‌‌ హైకమిషనర్‌‌‌‌‌‌‌‌ అన్నారు.

అఫ్గాన్‌‌‌‌లోని పేదలకు సాయం చేస్తున్న ఎన్జీవోలలో మహిళా ఉద్యోగులను పనికి రానీయకుంటే.. ఆయా సంస్థలపై ఆధారపడి బతుకుతున్న వారి పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఎన్జీవోలలో స్త్రీలపై నిషేధం విధించడంతో ఇప్పటికే నాలుగు ప్రధాన అంతర్జాతీయ ఏజెన్సీలు అఫ్గాన్‌‌‌‌లో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.

గత వారం తాలిబాన్‌‌‌‌ ప్రభుత్వం మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధించారు. దీనిపై అంతర్జాతీయంగా, అఫ్గానిస్తాన్‌‌‌‌లో నిరసనలు వ్యక్తమయ్యాయి.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News