ప్రమాదానికి నిలయంగా కంభం జాతీయ రహదారి..

• ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పటికీ చర్యలు శూన్యం

On
ప్రమాదానికి నిలయంగా కంభం జాతీయ రహదారి..

కంభం సెప్టెంబర్ 21 (న్యూస్ ఇండియా)

ప్రకాశం జిల్లా కంభం మండలం లోని హెచ్.పి పెట్రోల్ బంక్ సమీపాన ఉన్న అమరావతి అనంతపురం జాతీయ రహదారి పై డేంజర్ బెల్ అని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. హెచ్.పి పెట్రోల్ బంక్ సమీపాన ఉన్న యూ - టర్న్ వద్ద అటు వైపు ఇటు వైపు వెడల్పు తక్కువగా ఉండుట వలన ప్రజలు రోడ్డు ప్రమాదానికి గురౌతున్నారు.రాత్రి సమయం లో కారు ,బైకు ,లారీ వంటి వాహనాలు ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిందే.పొరపాటున నిద్ర మత్తులో మునిగారా ఇక మరణాన్ని చేరుకోవాల్సిందే.తప్పించుకునే అవకాశం కూడా ఆ రహదారిపై ఉండదు.అనేక మార్లు లారీ ,కారు వంటి పెద్ద వాహనాలు ఆ రహదారిపై గల యూ - టర్న్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటనలు అనేకం. నెలలో ఒకసారైనా క్రమం తప్పకుండా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తూనే ఉంటాయి.అయితే అధికారులు మాత్రం రోడ్డు ప్రమాదాలను అరికట్టుటకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.యూ - టర్న్ వద్ద నుండి కొంత ముందుకు వెళ్లగా రోడ్డు వెడల్పు ఎక్కువ మొత్తం లో ఉంటుంది అయినప్పటికీ అక్కడ విద్యుత్ దీపాలతో రోడ్డు అంతా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.కానీ యూ - టర్న్ ప్రారంభం లో మాత్రం వెడల్పు తక్కువగా ఉన్నప్పటికీ కనీస జాగ్రత్తలు అక్కడ కనిపించటం లేదు.రాత్రి సమయంలో ఆ రహదారిపై చిమ్మ చీకటిగా ఉండుట వలన క్రొత్త ప్రదేశాల వారు ఆ రహదారిపై ప్రయాణం చేస్తున్న సమయం లో రోడ్డు ప్రమాదానికి గురికావాల్సిన వరిస్తితి ఎక్కువ మొత్తం లో ఉందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.వెడల్పు తక్కువగా ఉండుట వలన అధిక వేగంతో వచ్చే పెద్ద వాహనాలు యూ - టర్న్ వద్ద తప్పించుకునే అవకాశం లేక రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నాయి.ఆ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినను వారికే కాక ఎదురుగా వస్తున్న ప్రయాణికులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.ఆ యూ - టర్న్ వద్ద ప్రమాదం అంతగా పొంచి ఉన్నప్పటికీ కనీసం ఒక విద్యుత్ బల్పు కూడా సంభందిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రజల సమస్యలు అధికారులకు పట్టవా అని కంభం పట్టణ ప్రజలు అనుకుంటున్నారు.మరో రోడ్డు ప్రమాదం ఆ ప్రాంతం లో చోటుచేసుకోకముందే సంభందిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.IMG-20230907-WA0387

Views: 258
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News