చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్

ఈ నెల 24 వరకు చంద్రబాబు రిమాండ్

On
చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్


స్కిల్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను శుక్రవారం ఏపీ హైకోర్టు కొట్టేసింది. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్‌ డిస్మిస్డ్‌’ అంటూ ఏకవాక్యంతో హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఇక 68 పేజీల చంద్రబాబు క్వాష్‌ ఆర్డర్‌ కాపీలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ కీలక దశలో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప పిటిషన్‌ను క్వాష్‌ చేయలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం అంటూ హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. ఇక ఈ పిటిషన్‌పై రోజుకు 5 కోట్లు తీసుకునే హరీశ్‌ సాల్వే, కోటి రూపాయలు తీసుకునే సిద్ధార్థ లుథ్రా లాంటి ఖరీదైన లాయర్లు చంద్రబాబు తరపున  వాదనలు వినిపించినా ఫలితం లేకపోయింది. మరోవైపు సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ వాదించారు.. సీఐడీ వాదనలతోనే ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది.WhatsApp Image 2023-09-22 at 2.56.35 PM

Views: 27
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???