సెప్టెంబర్ 22 చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే
సెప్టెంబర్ 22 చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి కోర్టుల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
మొదటిది - విజయవాడలోని ఏసీబీ కోర్టు స్కిల్ స్కామ్‌లో ఆయనకు రెండు రోజులు రిమాండ్ పొడిగించడంతో పాటు సీఐడీ విచారణకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై వాదనలను కూడా కోర్టు వాయిదా వేసింది.
రెండోది - ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఇక, మూడోది - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై చర్చ కొనసాగుతున్న సమయంలో పచ్చ పార్టీ పిచ్చి నేతలు సభను గందరగోళంగా మార్చారు. అసెంబ్లీ అని మరిచి అనుచిత ప్రవర్తనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి చిల్లర వేషాలు వేశారు. ఇలా చంద్రబాబు సెప్టెంబర్ 22వ తేదీ చంద్రబాబుకి ఓ పీడకలను మిగిల్చింది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List