పేదలకు పనికిరాని గృహలక్ష్మి పథకం
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలి పోయిన మహ్మద్ జాఫర్ ,దాసరమోని అంజయ్య ఇండ్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్, మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ప్రజలు మోసం చేయడానికి గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు కట్టు కోలేని నిరుపేద.అర్హులైన కుటుంబలకు ఇల్లు నిర్మాణం కోసం గృహ లక్ష్మి పథకం ద్వారా 3లక్షలు మంజూరు చేసి ఆదుకుంటామన్నారు. అధికారులే పేదల ఇంటి వద్దకే వచ్చి అర్హులైన వారిని గుర్తించి లబ్ది దారులను ఎంపిక చేసి గృహ లక్ష్మి ఇల్లు మంజూరు చేస్తారు. అని గొప్పలు చెప్పిన సీఎం పార్టీ నాయకుల ద్వారా లబ్ది దారులను ఎంపిక చేయించడం సిగ్గు చేటు అన్నారు.కానీ అరుట్ల గ్రామంలో మహమ్మద్ జాఫర్ ఇల్లు పూర్తిగా కూలి పోయి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. దాసరమోని అంజయ్య ఇల్లు పూర్తిగా కూలి పోవటంతో ప్లాస్టీక్ కవర్ తో పూరి గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నాడు.వీళ్ళు ఇద్దరు గృహ లక్ష్మి ఇల్లు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు.కానీ వీరిద్దరికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు రాలేదు.అదే వైఎస్సార్ పాలన దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద వాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసారు అన్నారు. కెసిఆర్ పాలల్లో బిఆర్ఎస్ నాయకులకు వాళ్ళు చెప్పిన వారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు వస్తున్నాయని ఆరోపించారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List