టిప్పర్ మట్టి ఆల్ లోడ్ చేస్తుండగా కరెంటు వైర్లు తగిలి వ్యక్తి మృతి
ఉప్పరిగూడ వ్యవసాయ పొలంలో టిప్పర్ తో మట్టి పని చేస్తుండగా పొరపాటున టిప్పర్ హైడ్రాలిక్ పైన ఉన్న కరెంటు తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం గడియ గౌరారం గ్రామానికి చెందిన అందుగుల అబ్బయ్య తండ్రి బాలయ్య వయస్సు (35 ) భార్య పది సంవత్సరాల క్రితమే మరణించింది. ఇతనికి ఇద్దరు కుమారులు జీవనాధారం కోసం ట్రిప్పర్ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. గత 15 నెలల నుండి మాదాపురానికి చెందిన బత్తుల వీరాస్వామి వద్ద టిప్పర్ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన అన్నుల చంద్రారెడ్డి వ్యవసాయ పొలంలోకి ట్రిప్పర్ తో మట్టి ఆన్ లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రిప్పర్ హైడ్రాలిక్ ను పైకిలేపగా పైన ఉన్న కరెంటు తీగలకు తాకి పక్కనున్న ట్రక్ రాడు తీయడంతో విద్యుత్తు ప్రసారం అయ్యి స్పృ హ కోల్పోవడం జరిగింది. ఇది గమనించి వెంటనే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మరణించడం జరిగింది. కేసు నమోదు చేసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ రామకృష్ణ తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List