
అంగన్వాడి వర్కర్ల సమ్మెకు పంచాయితీ కార్మికులు సంఘీభావం
సెప్టెంబర్ 23, 2023
న్యూస్ ఇండియా తెలుగు, తప్పేట్ల శ్రీనివాసరావు, అశ్వారావుపేట నియోజకవర్గం ప్రతినిథి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడి వర్కర్స్ కు సంఘీభావం తెలిపిన గ్రామపంచాయతీ కార్మికులు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు బెజవాడ రాము గొర్రెపాటి బసవయ్య ఉదయ్ మాట్లాడుతూ గత 13 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమ్మె చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గాని చీమకుట్టినట్టు కూడా లేదని అంగనవాడి కేంద్రాల్లో మూడు సంవత్సరాల పిల్లలకు అలనా పాలన చూస్తున్న వారికి మంచి భవిష్యత్తు మంచి నడవడిక తీర్చిదిద్ది ఈ దేశ పౌరులుగా ప్రధమ భూమిక పోషిస్తున్న అంగనవాడి కార్యకర్తలను చిన్నచూపు చూస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని వారు న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని వారికి బాసటగా అన్ని కార్మిక సంఘాలు ఏకమై కార్మిక హక్కులను సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ఏఐటియూసి నాయకులు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List