ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళని రక్షించిన రైల్వే సిబ్బంది

On
ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళని రక్షించిన రైల్వే సిబ్బంది

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో భర్తతో గొడవపడి గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను అలానే ఆమె పిల్లల్ని రైల్వే పోలీసులు రక్షించారు. రైలు పట్టాలపై తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న మహిళను గూడ్స్ ట్రైన్ కో పైలట్ గమనించి గూడ్స్ రైలు నిలిపివేయడంతో పాటు స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు వారిని రక్షించి ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. సమస్పూర్తితో వ్యవహరిస్తూ మహిళను చిన్నపిల్లల్ని కాపాడిన రైల్వే పోలీసులను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.IMG-20230923-WA0401

Views: 243
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News