ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళని రక్షించిన రైల్వే సిబ్బంది
On
గిద్దలూరు న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలో భర్తతో గొడవపడి గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను అలానే ఆమె పిల్లల్ని రైల్వే పోలీసులు రక్షించారు. రైలు పట్టాలపై తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న మహిళను గూడ్స్ ట్రైన్ కో పైలట్ గమనించి గూడ్స్ రైలు నిలిపివేయడంతో పాటు స్థానిక రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు వారిని రక్షించి ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. సమస్పూర్తితో వ్యవహరిస్తూ మహిళను చిన్నపిల్లల్ని కాపాడిన రైల్వే పోలీసులను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.
Views: 242
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Aug 2025 09:52:44
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న అధ్యాపకులు..
రంగారెడ్డి జిల్లా,...
Comment List