పకడ్బందీగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.....
మున్సిపల్ కమిషనర్ పి సరస్వతి......
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో గణేష్ నిమర్జనం ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సరస్వతి అన్నారు శనివారం నిమజ్జనం ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లకు అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు శోభాయాత్ర జరిగే రహదారులలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడతామని చెరువులో గుంతలను డోజర్ సాయంతో లెవెల్ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో టిఎల్ఎఫ్ మీటింగ్ లో మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణకు బర్థన్ బ్యాంకులు ( స్టీల్ ప్లేట్స్) వినియోగించాలని స్వయం సహాయక సంఘాలకు జీవనోపాధి కల్పించడంతోపాటు ప్లాస్టిక్ నిషేధించడంలో భాగంగా 16 వార్డులకు నాలుగు వార్డులలో బర్థన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేట్ ఫంక్షన్లు సామాజిక మతపరమైన కార్యక్రమాల ద్వారా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా ఈ బ్యాంకు ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు. గ్లాసులు. గిన్నెలు. స్పూన్లు. బర్థన్ బ్యాంకులో ఉండాలని అన్నారు లీఫ్ ప్లేట్స్ పేపర్ గ్లాసెస్. జ్యూట్ బ్యాగ్స్ తయారు చేయాలని సూచించారు. ఇలా చేయడం వలన 100 శాతం ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది టీ ఎల్ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Comment List