ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
వేడుకున్న రుద్ర తిరుపతి
పరామర్శించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలిపాక శంకర్
అతనిది ఒక దయనీయ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎవరికోసం ఎదురు చూడాలో తెలియదు.తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే మరణించాడు.తల్లి గుండె ఆపరేషన్ చేయించుకుని కన్న కొడుకు సాదుతాడని ఆశతో ఆ తల్లి ఎదురుచూపు అమ్మకు తన వంతు సహాయంగా తన మీద వచ్చే పింఛన్తో కుటుంబాన్ని పోషిస్తూ ఎవరీ మీద ఆశపడకుండా జీవనం కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని వికలాంగుల పోరాట సమితి మండల అధ్యక్షులు రుద్ర తిరుపతి అనే వ్యక్తి బతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగిస్తూ వికలాంగుల కోసం నిత్యం పోరాడుతూనే ఉండేవాడు. అతని పరిస్థితి చుట్టుపక్కల ఉన్నవారు అయ్యో పాపం అన్న మాటకు ఆమడ దూరంలో ఆ కుటుంబ పరిస్థితి ఉన్నది. కూలి పని చేసి తల్లిని పోషించాలన్న ఆయన కోరిక, ఆలోచన అలగానే మిగిలిపోయింది.ఎందుకంటే అంగవైకల్యం కలవాడు ఏ పని చేయలేని దౌర్భాగ్య స్థితి ఆయనకు రావడం ప్రజల మనసులను ఒక్కసారిగా కలిసి వేసింది. పుట్టింది పెద్ద కులంలోనైనా కుటుంబ పరిస్థితులు మాత్రం దీనస్థాయికి దిగజారింది. గత కాలంలో ఆయన తండ్రి రుద్ర బిక్షపతి జాతకాలు చెప్పుకుంటూ అందరి తలలలో నాలుకలాగా మెదిలిన ఆయన ఒక్కసారిగా పక్షవాతం వచ్చి కొన్ని ఏండ్లు మంచాన పడి మరణించడంతో అందరికీ మంచి భవిష్యత్తు చూపిన ఆయన ఇప్పుడు మా భవిష్యత్తు ఎవరు చూడాలంటూ ప్రతి ఒక్కరినీ అడిగే పరిస్థితి ఆ కుటుంబంలో నెలకొన్నది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైనా వారికి తగిన విధంగా సహాయం చేయాలని ఊరు ప్రజలంతా కోరుకుంటున్నారు. అందరితో కలిసిమెలిసి తిరిగి ప్రతి సంఘంలో ముందుండి నడిపించి ఆ సంఘానికి ఆయన దూరంలో ఉన్న అయ్యో నా వికలాంగుల సైన్యానికి ఏమైనా లోటు ఏమైనా జరుగుతుందన్న ఆలోచన ప్రతిరోజు ఆయన మనసులోనే మెదులుతున్నది. ఇప్పటికైనా ఎవరైనా అధికారులు గానీ రాజకీయ వేత్తలు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గాని ఉంటే మా కుటుంబానికి సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామంటూ రుద్ర తిరుపతి వేడుకున్నారు.
Comment List