పోగొట్టుకున్న ఫోన్ రికవరీ, బాధితుడికి అప్పగించిన పోలీసులు
బాధితులకు అందజేస్తున్న పోలీసులు
ప్రజలు తమ విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలని క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాబ్యానాయక్, ఎస్సై మారయ్య అన్నారు.పోగొట్టుకున్న ఫోన్‌లను రికవరీ కోసం తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ (CEIR PORTAL) ప్రభావం చూపుతోంది. CEIR PORTAL సహాయంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 3 సెల్‌ఫోన్‌లను పోలీసులు తక్కువ సమయంలో రికవరీ చేశారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి సోమవారం పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సెల్‌ఫోన్‌లో పోగొట్టుకున్న బాధితులు ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సీఐఐఆర్‌లో కంప్లైంట్‌తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సెల్‌ఫోన్‌లను పట్టుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రికవరీ చేసిన పోలీస్ క్రైమ్ కానిస్టేబుల్ నగేష్ , చంద్ర శేఖర్‌ను అభినందించారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List