ఘనంగా గిద్దలూరు జనసేన ఇంచార్జ్ "బెల్లంకొండ" జన్మదిన వేడుకలు
కంభం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గం జనసేనా ఇంచార్జ్ "బెల్లంకొండ సాయిబాబు" జన్మదిన వేడుకలు సోమవారం కంభం మండలంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమం కంభం మండల జనసేన అధ్యక్షడు తాడిశెట్టి ప్రసాద్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి లంకా నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ముందుగా బెల్లంకొండ సాయిబాబు జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కంభం మండల జనసేన అధ్యక్షడు తాడిశెట్టి ప్రసాద్, ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి లంకా నరసింహా రావు లు మాట్లాడుతూ బెల్లంకొండ సాయిబాబు నాయకత్వంలో గిద్దలూరు లో నాయకులు అందరు శ్రమించి జనసేన జెండా ఎగురవేయడం జరుగుతుందన్నారు.అలానే నాయకులు అందరు పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ,జిల్లా ఆర్గనైజేషన్ కమిటీ కార్యదర్శి ఉదయగిరి మల్లికార్జున, కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్,రాచర్ల మండల అధ్యక్షుడు పుట్ట బాలకృష్ణ, బెస్తవారపేట మండల నాయకులు ముంతల మధు సుధన్ రెడ్డి, దేవరాజ్,కంభం మండల నాయకులు కోళ్ల రమణ,సురే ప్రసాద్,చింటు,తుమ్మలపల్లి లోకేష్,షేక్ అజ్జు,దూదేకుల కాశింవలి,బెల్లంకొండ సాయన్న,సూరే శ్రీనివాసులు,గాజుల సురేష్,పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు
Comment List