
పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య
దామరవంచ గురుకుల పాఠశాల విద్యార్థి
నర్సంపేట పట్టణంలో చోటు చేసుకున్న సంఘటన
గూడూరు మండలంలోని దామరవంచ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రాజేష్ నర్సంపేట పట్టణంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి గత 14 వ తారీఖున జ్వరం వచ్చిన కారణంగా తన స్వగ్రామమైన ములుగు జిల్లా ఇంచర్లపల్లి గ్రామానికి వెళ్ళాడు. మరల 25వ తారీఖున సోమవారం రోజు నర్సంపేటకు చేరుకొని ఒక పార్టీలైజర్ కి వెళ్లి తన తండ్రి రాహుల్ పేరు మీద పురుగుల మందు డబ్బా కొని నర్సంపేట అంగడి ఆవరణలోకి వెళ్లి ఆ పురుగుల మందులు సేవించాడు వెంటనే అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు అతనిని 108 వాహనంలో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆపద్మారక స్థితిలోకి మరణించడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారని తీసుకువెళ్లిన ప్రజలు వెంటనే నర్సంపేట పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని సమాచారం తెలియకపోవడంతో సోషల్ మీడియా గ్రూపులో పోలీసులు పోస్ట్ చేయడం ద్వారా విషయం బయటకు వచ్చిందిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తయ్య వివరణ ఇచ్చారు. గత 14 వ తారీఖున తన స్వగ్రామానికి వెళ్లాడని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదని, ఆయన తండ్రి రాహుల్ అడగగా మా కర్మకాలి ఇదంతా జరిగిందని రాజేష్ తండ్రి రాహుల్ తెలిపారని ముత్తయ్య తెలిపారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List