గణపతి నిమర్జనోత్సవానికి డీజేలు నిషేధం: ఎస్సై పెండ్యాల ప్రభాకర్

On
గణపతి నిమర్జనోత్సవానికి డీజేలు నిషేధం: ఎస్సై పెండ్యాల ప్రభాకర్

IMG-20230926-WA0674 గణపతి నవరాత్రి భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి రేపు అనగా తేదీ 27-09-2023 రోజు నిమజ్జనం కు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని వలిగొండ మండల ఎస్సై పెండ్యాల ప్రభాకర్ మండల ప్రజలనుద్దేశించి తెలియజేశారు.DJ సౌండ్ సిస్టం వినియోగించినటువంటి వారిపై కేసు నమోదు చేసి DJ సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం జరుగుతుంది

ఎవరైనా నిమర్జనం ఉత్సవాలలో DJ సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొన్నా, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

నిమజ్జన సమయంలో సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోగలరు. మీ యొక్క విగ్రహాలను వీలైనంత తొందరగా నిమజ్జనం కొరకు చెరువు వద్దకు తీసుకొని వెళ్ళగలరు. నిమర్జనం ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే 100కి లేదా లోకల్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందజేయగలరు. కావున ప్రజలందరూ గణపతి నిమర్జన ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో ప్రశాంతంమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేయుచున్నాము.

Views: 516
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News