చదువుతోపాటు క్రీడలతో ఉజ్వలభవిష్యత్తు..

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినీలు విజయకేతనం

On
చదువుతోపాటు క్రీడలతో ఉజ్వలభవిష్యత్తు..

రాష్ట్రస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థినీలు ఎంపిక...

IMG-20230926-WA0249

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి..

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమేనని క్రీడల్లో రాణించి దేశ కీర్తి ప్రతిష్టలు నింపాలని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి అన్నారు. ఎస్.జి.ఎఫ్.ఐ 67వ నేషనల్ స్కూల్ గేమ్స్ రంగారెడ్డి జిల్లా స్థాయి లెవెల్ కబడ్డీ సెలక్షన్స్ తెలంగాణ రాష్ట్ర క్రీడల అధ్యక్షుడు రాఘవరెడ్డి, భాస్కర్ రెడ్డి, సరూర్నగర్ జోన్ సెక్రటరీ ఉషా కిరణ్, డాక్టర్ నరసింహ యాదవ్, కోచ్ శ్రీను ఆధ్వర్యంలో ఎంపికైన కబడ్డీ క్రీడాకారులు ఈ నెల 23వ తేదీన జిల్లా లెవెల్ కబడ్డీ సెలక్షన్స్ అండర్ 14 /17 గర్ల్స్ విభాగం హైదరాబాద్ లింగంపల్లి చీరిక్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి  క్రీడా పోటీలలో ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థినీలు జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలు ముస్కాన్ వైశాలి, సుస్మిత, సోనాలి లు ఉన్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగజ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడా పోటీలలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలన్నారు. విద్యార్థినీలు రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. చదువుతోపాటు క్రీడారంగంలో ప్రతిభ కనబరిచడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు క్రీడలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుందని సూచించారు. ప్రతి విద్యార్థి క్రీడారంగంలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. అనంతరం పిఈటి చిప్పలపేల్లి సురేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. దేహదారుఢ్యంతో మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ అనుకున్న రంగంలో రాణించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినిలకు సూచించారు. విద్యార్థులను క్రీడల్లో నిష్టాతులుగా తయారుచేసిన పీఈటి చిప్పలపేల్లి సురేష్ ను ప్రత్యేకంగా ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 105
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ