భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

దర్యాప్తు చేస్తున్న ఎస్సై నరసింహారావు

On

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లోని మల్లాపురం గ్రామానికి చెందిన ఇళ్ళూరి సింగరయ్య అతని తమ్ముడు ఇళ్ళూరి బాలయ్యకి మధ్య "భూ వివాదాల్లో" ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో పెద్దవాడైన ఇళ్లూరి సింగరయ్య తలకి దెబ్బతగలటం తో ఆసుపత్రి పాలయ్యాడు.అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో పెద్దవాడైన ఇళ్ళూరి సింగరయ్య కూతురు అనంత పులమ్మకు కూడా చిన్నపాటి గాయాలు కాగా ప్రస్తుతం సింగరయ్య , పులమ్మ ఇద్దరూ కంభం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

• బాధితుడు తెలిపిన వివరాలుIMG-20230926-WA0320IMG-20230926-WA0319

బాధితుడు ఇళ్ళూరి సింగరయ్య తెలిపిన వివరాల మేరకు తనకి తన తమ్ముడు అయిన ఇళ్ళూరి బాలయ్య కి గత కొంత కాలంగా "భూ" వివాదాలు ఉన్నాయని అన్నారు.తమకి ఉన్న 90 సెంట్లు అన్నదమ్ముల పొలాన్ని గురించి ఈ వివాదం వచ్చిందని తెలిపారు.సోమవారం సాయంత్రం పెద్దవాడైన సింగరయ్య పొలంలో పని చేస్తుండగా తన తమ్ముడు ఘర్షణకు దిగాడని తెలిపారు.ఈ ఘర్షణలో తన తమ్ముడైన బాలయ్య సంబంధం లేని వ్యక్తులను తీసుకుని వచ్చి దాడి చేశారని ఈ దాడిలో తనకి తలకి దెబ్బ తగిలిందని అలానే తన కూతురైన పులమ్మ కి కూడా గాయాలయ్యాయని అన్నారు.గాయాలపాలైన బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై నరసింహా రావు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారని తెలిపారు.

Views: 256
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News