బెజవాడలో మళ్లీ కత్తులు నూరుతున్నారా.?

On

బెజవాడలో మళ్లీ కత్తులు నూరుతున్నారా.? ఒకప్పుడు రౌడీయిజానికి కేంద్రంగా ఉన్న విజయవాడ.. మళ్లీ ఆ దిశగా నడుస్తోందా.? అంటే అవుననే సందేహాలు వస్తున్నాయి. తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వంగవీటి రాధా ఆరోపణలతో.. బెజవాడ వర్గ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. చాపకింద నీరులా మళ్లీ రక్తచరిత్ర విస్తరిస్తోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకు రాధాపై కుట్ర చేసింది ఎవరు.? ప్రత్యర్థులా.. సొంతపార్టీ వారా.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి…? గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి […]

బెజవాడలో మళ్లీ కత్తులు నూరుతున్నారా.? ఒకప్పుడు రౌడీయిజానికి కేంద్రంగా ఉన్న విజయవాడ.. మళ్లీ ఆ దిశగా నడుస్తోందా.? అంటే అవుననే సందేహాలు వస్తున్నాయి. తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వంగవీటి రాధా ఆరోపణలతో.. బెజవాడ వర్గ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. చాపకింద నీరులా మళ్లీ రక్తచరిత్ర విస్తరిస్తోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకు రాధాపై కుట్ర చేసింది ఎవరు.? ప్రత్యర్థులా.. సొంతపార్టీ వారా.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి…?

గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన రాధా… తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారంటూ బాంబు పేల్చారు. తనను చంపాలని చూసినా భయపడేది లేదన్నారు. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. రంగా కీర్తి,ఆశయాల సాధనే నా లక్ష్యమన్న రాధా…తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. తనను చంపాలని చూసిన వారి బాగోతం త్వరలోనే బయటపెడతానన్నారు.

వంగవీటి రాధా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు బెజవాడలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాధాపై రెక్కి నిర్వహించారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే రెక్కి కాదు రాధాపై కొంతమంది దాడికి ప్రయత్నించారంటున్నారు ఆయన అనుచరులు. సుమారు గంటకు పైగా రాధా కార్యాలయం చుట్టు దుండగులు సంచరించారు. ఆఫీసు బయటకు వచ్చి ఫోన్‌ మాట్లాడుతుండగా అపరిచితుల కదలికలను గ్రహించిన రాధా… వారు తన ఆఫీసు దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించడంతో అనుమానించారు. వెంటనే రోడ్డుపైకి వచ్చేశారు. అపరిచితులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారన్న విషయాన్ని రాధా గోప్యంగా ఉంచారు.

రాధాపై రెక్కి నిర్వహించిన రోజే టీడీపీ నేత పట్టాభి, టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. పట్టాభి ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని రాధాకు చెప్పారు అనుచరులు. అదే టైంలో ప్రత్యర్థుల కారు కనిపించడంతో దాన్ని ఒంటరిగా వెంబడించారు రాధా. దీంతో రాధాకు అనుమానం వచ్చిందని గ్రహించిన ప్రత్యర్థులు కారును వేగంగా పోనిచ్చారు. కారు కనిపించకుండా పోవడంతో అక్కడి నుంచి నేరుగా పట్టాభి ఇంటికి వెళ్లిన రాధా.. వారిని పరామర్శించారు. ఈ లోపు రెక్కీ విషయం రాధా అనుచరులకు కూడా తెలిసి పోయింది. దీనిపై ఆందోళన చెందిన అనుచరులు రాధాకు ఫోన్‌ చేసి సంప్రదించగా…ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని..అంతా తానూ చూసుకుంటానని ఆదేశించారు.

Read More ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు