గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
గణేష్ మండపాల నిర్వహకులకు వివరిస్తున్న ఏసిపి
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇబ్రహీం పట్నం నియోజకవ ర్గంలో నిర్వహించడం నున్న గణేష్ నిమజ్జ నాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్. రావు.. నిమజ్జనం ఏర్పాట్లపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి పాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవిం చాలని చెప్పారు. అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావే శంలో ఎస్ఐ లు మారయ్య, మైబెల్లి, రామకృష్ణ, నాగరాజు, డిఐ బాబ్య నాయక్, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List