*60 శాతం ఉన్న బీసీలకే భువనగిరి నియోజకవర్గ టికెట్ కేటాయించాలి*
అధిష్టానం ఎవరికీ టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తాం
వలిగొండ మండల కేంద్రంలో వై ఎస్ సి ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ప్రత్యేక పూజలు పాల్గొనీ అన్నదాన కార్యక్రమం ప్రారంభించినారు. ఈ సందర్భంగా బీసీ నినాదంతో బిసి లకు భువనగిరి నియోజకవర్గ టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనతో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని మాయమాటలతో ప్రజలను మభ్య పెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఏ సంక్షేమ పథకాలు పెట్టిన పూర్తి చేయలేని ఘనత కేసిఆర్ పాలనకు దక్కుతుందని సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ పార్టీ వాళ్లకు మాత్రమే చెందుతున్నయని ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలు తెలంగాణ భవిష్యత్తును మారుస్తాయని వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తారని అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణగా సాధ్యపడుతుందని అన్నారు. మొదటగా భువనగిరి నియోజకవర్గం లో 60 శాతం మంది ఉన్న బీసీలకు ప్రాధాన్యమిస్తే భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అందుకోసం బీసీలకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. కుంభం అనిల్ రెడ్డి రావడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుందని అధిష్టానం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా వారికి సపోర్ట్ చేసి పార్టీని గెలిపిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసే పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మాజీ ఎంపీటీసీ పలుసం సతీష్ గౌడ్, నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సుక్క స్వామి, నీటి సంఘం మాజీ చైర్మన్ మునుకుంట్ల అశోక్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బత్తిని నాగేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comment List