పేదలకు వరం సీఎం సహాయనిధి

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

On
పేదలకు వరం సీఎం సహాయనిధి

సీఎం

IMG_20230927_195752
లబ్ధిదారుకు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే

లీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు.కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కె గ్రామానికి చెందిన వెంకట్ భార్య ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 3 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారుకు నారాయణాఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బుధువారం రోజు తననివాసం వద్దచెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రజల అంధత్వ నివారణ కోసం కంటి వెలుగు ప్రారంభిస్తే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ,నాగూర్ కె సర్పంచ్ నీలమ్మ ఈరప్ప,నారాయణాఖేడ్ మండల ఎంపీపీ తనయుడు రమేష్ చౌహన్,తదితరులు ఉన్నారు

Views: 14
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News