డివిజన్లో వినాయక నిమజ్జనం
డివిజన్లో వినాయక నిమజ్జనం పర్యవేక్షించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని స్థానిక కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి హయత్ నగర్ ఇన్స్పెక్టర్ హెచ్ వెంకటేశ్వర్లు సమక్షంలో అధికారుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నవరాత్రులు పూజలు అందుకొని నిమజ్జనానికి సిద్ధం అయిన గణనాథుడు సజావుగా ఊరేగింపు సమయంలో రోడ్ల పైన చెట్టుకొమ్మలు అడ్డు లేకుండా చేయాలని హర్టికల్చర్ వారికి సూచనలు చేశారు. కార్పొరేటర్ దగ్గర ఉండి సంబంధిత జిహెచ్ఎంసి, ఎలక్ట్రిసిటీ, పోలీస్ శాఖ, శానిటేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు నిమజ్జనం చేసే సమయంలో ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చూసుకోవలసిన బాధ్యత అధికారులదే అని వారు అన్నారు. ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఇతర శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List