
దళిత బందులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి: సిపిఎం డిమాండ్
అర్హులైన పేదలకు మాత్రమే దళిత బంధు ఇవ్వాలి
వలిగొండ

మండల కేంద్రంలో గురువారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఎం నిరసన దీక్షకు ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు మండల కార్యదర్శి సిర్పంగి స్వామి హాజరై వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత బంధు, గృహలక్ష్మి పథకం, బీసీ/ మైనార్టీలకు లక్ష రూపాయల సహాయం లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో గ్రామ సభలకు సంబంధం లేకుండా ఏకపక్షంగా తమ పార్టీ కార్యకర్తలకు కేటాయించుకోవడం సిగ్గుచేటని వెంటనే గ్రామ సభల ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రకాల సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు
పైగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను టిఆర్ఎస్ కార్యకర్తల పథకాలుగా మారుస్తున్నారని గత ప్రభుత్వాలు నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రజలందరి సమక్షంలో రాజకీయాలకతీతంగా గ్రామసభల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించే వారని కానీ నేటి ప్రభుత్వం ఆ పథకాలను తమ పార్టీ కోసం కేటాయించిన పథకాలుగా మార్చుకుంటున్నారని వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు
అనేక గ్రామాల్లో రాజకీయ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంగనామాలు పెడుతున్నారని టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు రాజకీయ వలసలను ప్రోత్సహిస్తున్న తమ పార్టీ నాయకుల విధానాలను వ్యతిరేకించాలని కోరారు మండల వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం కోసం సుమారు 5వేల పైగా లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారని దళిత బంధు, గృహలక్ష్మి పథకం,బీసీ/మైనార్టీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక విషయంలో టిఆర్ఎస్ నాయకులు ఎవరికి కేటాయించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీలకు మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కింద ఇస్తామని పదేపదే చెబుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మూడు నెలల నుంచి ఊరించడం తప్ప బీసీలకు,మైనార్టీలకు ఒక్కరికి అంటే ఒక్కరికి లక్ష రూపాయల రుణాలు అందించిన పరిస్థితి లేదని దీనికి ఎప్పుడు ఇస్తారు?? బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపును గ్రామ సభల ద్వారా ఎంపిక చేయకపోతే గ్రామీణ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి సిపిఎం వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ అధ్యక్షత వహించగా సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, కూర శ్రీనివాస్, కల్కూరి రామచందర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు కందడి సత్తిరెడ్డి, గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకటరెడ్డి, కర్ణ కంటి యాదయ్య, బుగ్గ చంద్రమౌళి, కల్కూరి ముత్యాలు, సిపిఎం నాయకులు వివిధ శాఖల కార్యదర్శులు దయ్యాల సత్య రాములు,పల్సం లింగం,దొడ్డి బిక్షపతి, దండెం నర్సిరెడ్డి, రాధారపు మల్లేశం, చేగురి నగేష్, మారబోయిన నరసింహ, కందగట్ల సాయి రెడ్డి, దయ్యాల మల్లేశం, సుర్కంటి రామచంద్రా రెడ్డి, చేగురి నరసింహ,వేముల లక్ష్మయ్య, పిట్టల అంజయ్య, మంగ బాలయ్య,చెరుకు జంగయ్య,ఉండ్రాటి పాపయ్య, బొడ్డు రాములు, దొడ్డి యాదగిరి, కల్కూరి రాంచందర్, కందుల బాలయ్య, ముంత స్వామి, తదితరులు పాల్గొన్నారు
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List