టికెట్ పై ఆశలు వదిలేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
పాయకరావుపేటలో వైసీపీ అభ్యర్ధి ఎవరు?
చేజేతులా చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైసీపీని గాడిలో పెట్టే పనిలో హైకమాండ్ బిజీగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తీరుతో తలోదారి పట్టిన కేడర్ ను ఒక్కతాటిపైకి తెచ్చే పనిలో పడింది. దీనిలో భాగంగా మొదట ఎమ్మెల్యే గొల్లబాబూరావును పక్కనపెట్టాలని నిర్ణయించింది. అధికార వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీరుతో వైసీపీ గ్రామ స్థాయిలో బాగా దెబ్బతింది. కార్యకర్తల ఆత్మస్థైర్యం కూడా బలహీనపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని సీఎం జగన్ నిర్ణయించడంతో పాయకరావుపేటపై బాబూరావు ఆశలు వదిలేసుకున్నారు. టికెట్ రాదని తెలిసి సైలంటయ్యారు. గతంలో తన వారికే పనులు ఇచ్చి.. అసలైన వైసీపీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో వారంతా బాబూరావుకు వ్యతిరేకమయ్యారు. బాబూరావును మార్చాల్సిందేనంటూ వైవీ సుబ్బారెడ్డి సహా జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు పంచాయితీ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయానికి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. బాబూరావు పట్ల వైవీ సానుకూలంగా ఉన్నా సర్వే రిపోర్టులతో ఎమ్మెల్యే పని తీరుపై జగన్ ఓ అంచనాకు వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావును మార్చి కొత్త అభ్యర్ధిని నిలబెట్టాలని ఆలోచన చస్తున్నారు. టీడీపీని ఢీకొట్టగల సత్తా ఉన్న అభ్యర్ధిని బరిలో దింపేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మాస్ ఇమేజ్ ఓ మహిళా అభ్యర్ధి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజలు, నాయకులతో ఆమెకు ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇస్తే పార్టీని మళ్లీ గాడిలో పెట్టినట్లు అవుతుందని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List