ఏపీలో మరో స్కీంతో ప్రజల గుండెల్లో జగన్
దేశంలో ఎవరూ చేయనిది. ఎప్పుడూ జరగనిది. ప్రజా సంక్షేమంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. నాణ్యమైన వైద్యం ఒక ప్రత్యేక హక్కు కాదు, ప్రాథమిక హక్కు అని గుర్తించి రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగమే జగనన్న ఆరోగ్య సురక్ష.
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజల చెంతకే ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లే బృహత్తర కార్యక్రమం. దీన్ని ప్రజల ఆరోగ్యం కోసం వివిధ దశల్లో అమలు చేస్తోంది.
ఇంటింటికీ ఆరోగ్యంపై అవగాహన, పరీక్షలు:
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి వ్యక్తికి సమగ్ర ఆరోగ్య పరీక్షలను నిర్వహించేందుకు ANMలు మరియు వాలంటీర్ల తో కూడిన ప్రత్యేక బృందం నిబద్ధతతో ప్రతి ఇంటికి వెళ్తారు. ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఆరోగ్య శిబిరాలు - ఆశాకిరణం:
సెప్టెంబరు 30 నుండి,రెండవ దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల నిర్వహిస్తారు.
ఈ శిబిరాలు కారుణ్యానికి కేంద్రాలుగా ఉంటాయి, ఉచిత వైద్య పరీక్షలు, అనుభవజ్ఞులైన వైద్యులతో సలహాలు మరియు అవసరమైన మందులను అందిస్తాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 10,000కుపైగా ఆరోగ్య శిబిరాలు, 15,000 మంది వైద్యులను భాగస్వామ్యం చేయడం ద్వారా రాష్ట్రంలో కోటికి మందికిపైగా ప్రజలకు ఈ కార్యక్రమం చేరువైంది.
జగనన్న ఆరోగ్య సురక్ష కేవలం రాష్ట్ర కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ఒక ఆశ, అభివృద్ధిలో భాగమై ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది.
జగనన్న ఆరోగ్య సురక్షతో రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దుతోంది...

About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List