దీక్షిత్ రెడ్డి హత్య రోజు అసలేం జరిగింది?
నిందితుడు టెక్నాలజీతో ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశాడు?
మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలుడు దీక్షిత్ రెడ్డి మర్డర్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు మందసాగర్ దోషిగా తేలడంతో మరణశిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా తీర్పునిచ్చింది. ఈ మేరకు జిల్లా ప్రధాన జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ తీర్పు వెలువరించారు.
ఆ రోజు అసలేం జరిగింది?
మహబూబాబాద్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న రంజిత్ రెడ్డి కుమారుడు దీక్షిత్. బాలుడు ఆడుకుంటున్న సమయంలో నిందితుడు మంద సాగర్ అనుకున్న ప్లాన్ ప్రకారం ఎత్తుకెళ్లాడు. అక్కడి నుంచి కే సముద్రం మండలం అన్నారం శివారులో ఉన్న ధానమయ్య గుట్టపై తీసుకెళ్లా.. బాలుడిని హతమార్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కిడ్నాప్ చేసిన రోజు రాత్రి దీక్షిత్ తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.45 లక్షలు ఇస్తే బాలుడ్ని వదిలేస్తానని చెప్పాడు. పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లు బాలుడి తల్లిదండ్రులతో కలిసి వెతుకుతున్నట్లు డ్రామాలాడాడు. ముందు ఎవరికీ సాగర్‌పై అనుమానం రాలేదు.
సాగర్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది.. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నేరాన్ని అంగీకరించాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసినట్లు తేలింది. పోలీసులకు దొరికిపోతామన్న భయంతోనే దీక్షిత్‌ను చంపినట్లు తేల్చారు. అలాగే సాగర్ బాలుడిని తీసుకెళ్తున్న సీసీ ఫుటేజీ కూడా దొరికింది. సాగర్ చదివింది ఏడో తరగతి అయినా సరే టెక్నాలజీపరంగా అప్డేట్‌గా ఉన్నాడు. అతడు ఓ యాప్ ద్వారా గొంతు మార్చి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ కాల్స్ చేసినట్లు గుర్తించారు. 2020లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో కలకలం రేపింది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List