రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం..
On
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్బీనగర్లోని మైత్రినగర్ కు చెందిన గుణగంట వెంకటేష్(37) తండ్రి యాదయ్య బుధవారం తార్నాకపు వెళ్తున్నానని తన భార్యతో చెప్పి వెళ్లాడు. ఇప్పటివరకు అతను తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం లేదు ఆరా తీసిన ఫలితం లేదు. అతని భార్య సబితా బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాంతో తన భర్తకు ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా అతన్ని అనుమానిస్తుంది. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Views: 64
Tags:
Comment List