
మండల స్థాయి ఎస్ జి ఎఫ్ ఐ గేమ్స్.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు
67వ ఎస్ జి ఎఫ్ ఐ గేమ్స్ మండల స్థాయి కబడ్డీ, ఖో ఖో ,వాలీబాల్ ఆటలు
జనగాం జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో 67వ ఎస్ జి ఎఫ్ ఐ గేమ్స్ మండల స్థాయి కబడ్డీ, ఖో ఖో ,వాలీబాల్ ఆటలు అండర్ 14 అండర్ 17 విద్యార్థిని విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు నందు ప్రారంభించబడినవి. ఈ గేమ్స్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ మండల స్థాయి 12 హైస్కూలు ,మూడు రెసిడెన్షియల్ స్కూలు, 8 ప్రైవేట్ హై స్కూల్స్ విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యారు. ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మరియ జేతృతా అధ్యక్షతన ముఖ్యఅతిథిగా నల్లా నాగిరెడ్డి ఎంపీపీ, శ్రీ గంటా రవీందర్ గారు మహాత్మ హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు, గ్రామ సర్పంచ్ పుస్కురు పార్వతీ రాజేశ్వరరావు ,ఎంపీటీసీ కళింగ రావు ,ఎఫ్ఎసిఎస్ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, మాజీ హెచ్ఎం పోతుగంటి నరసయ్య,ఎస్ఎంసి చైర్మన్ అబ్బాస్ , కారు పోతుల వెంకటయ్య ,జంపాల అంజయ్య ,నాజర్,ఎస్ జి ఎఫ్ ఐ సెక్రెటరీ కూటికంటి శ్రీనివాస్ మరియు పి డి లు, పిఈటిలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలను కూడా మన దగ్గర జరిగేటట్లు మంత్రివర్యులు దయాకర్ రావుచే ఇక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్య అతిథి ఎంపీపీ అన్నారు. విద్యార్థులు ఆటలలో చక్కగా పాల్గొని మన మండలానికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. శ్రీ గంటా రవీందర్ ఆటలకు అవసరమైన షీల్డ్లు, బహుమతులు ,క్రీడా డ్రస్సులు ఇచ్చారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List