
ఘనంగా జగనన్న ఆరోగ్య సురక్ష్యా కార్యక్రమం..
బేస్తవారిపేట న్యూస్ ఇండియా


ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లోని సచివాలయం -1 పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష్యా కార్యక్రమం ప్రారంభించారు.ఆ కార్యక్రమానికి ప్రజలు బారి ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమగు మందులను ఉచితంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో అధించటం జరుగుతుందన్నారు.అలానే ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన ప్రభుత్వం, ఫ్యామిలీ డాక్టర్, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మేలు చేకూర్చుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని కొనియాడారు.తదుపరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పృధ్వీ రాజ్ మాట్లాడుతూ మండలం లోని ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వైద్యానికి సంబంధించి ఎటువంటి కర్చు లేకుండా అన్ని రకముల పరీక్షలు ఉచితంగానే చేయటం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్, తాసిల్దార్ , ఎంపీడీవో ,ఎంపిపి, వైద్యుడు పృధ్వీ రాజ్, వైద్య సిబ్బంది సచివాల సిబ్బంది, వాలంటీర్లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List