
ఘనంగా మునగనూరులో ఈద్ మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు...

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాద్ - ఉన్ - నబి వేడుకలు ఎండి. సద్దాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు నందు జరిగిన కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం వారిని ముస్లిం సోదరులు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలాద్ - ఉన్ - నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈద్ మిలాద్ - ఉన్ - నబీ సంప్రదాయం ప్రకారం శరపథ్ ను స్వీకరించి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరి, శివ, వీరేష్, ఎండి రాక్, అనామ్, శ్రీను, రమేష్ గౌడ్, నాగరాజు, అయాన్, సపలి, నూర్ భాష, ఆసద్, అజ్మద్, బాబా, అఫ్రీద్, ఆర్షద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List