తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కుంభం అనిల్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం

On
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కుంభం అనిల్ కుమార్ రెడ్డి

IMG-20231001-WA0895
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అనిల్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రానున్న రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలపై కాబోయే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,బట్టి విక్రమార్కలు ఈ ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకాలు చేశారని ఈ 6 గ్యారంటీలలో భాగంగా గృహలక్ష్మి కింద ఇల్లు,500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ రైతు భరోసా పై15వేల రూపాయలను, చేయూత పెన్షన్ ద్వారా 4000 రూపాయలు ఇస్తామని, యువ వికాసం ద్వారా 5 లక్షల రూపాయల భరోసాను కూడా అందిస్తామని ఆయన అన్నారు. 2018 ఎన్నికలలో కొద్ది మెజార్టీతో ఓడిన ఎన్నికలలో కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపొందుతామందనే ధీమాతో కార్యకర్తలు ఉండాలని వారు అన్నారు. దీనికోసం ప్రతీ కార్యకర్త ప్రతి నాయకుడు ఒక సైనికుల్లాగా పని చేయాలని వారిని ఉద్దేశించి సోమవారం రోజున గాంధీ జయంతి సందర్భంగా భువనగిరిలో జరిగే భారీ బైక్ ర్యాలీకి కాంగ్రెస్ కార్యకర్తలంతా భారీ ఎత్తున హాజరవ్వాలని ఆయన ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ ల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 405
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News