మదినగూడ లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : శేర్లింగంపల్లి అక్టోబర్ 2 (న్యూస్ ఇండియా తెలుగు)
జాతిపిత,మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాల వేసి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ....మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ ,పాపిరెడ్డి నగర్ డివిజన్ల లోని మదీనాగూడా , దీనబందు కాలనీలలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ అహింస అనే అయుధంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహోన్నతుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాల ద్వారా పోరాడచ్చు అని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి పోరాడే పటిమను నింపిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అందరూ మహాత్మాగాంధీ ఆశయాలను , జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు, కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగేశ్వర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి , కంటేస్టేడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు చంద్ర శేఖర్ యాదవ్, శ్రీశైలం, చంద్ర మోహన్ ,చంద్రయ్య , రమణయ్య , ఆకుల లక్ష్మణ్ , రాజేష్ గౌడ్ ,రమేష్ , అశోక్, గణేష్ ముదిరాజ్, యాదగిరి , సుబ్బారెడ్డి, రెడ్య నాయక్ , రాజు , నంద గోపాల్ ,బాలాజీ , నరేష్ , మల్లేష్, శివ ,రాజేష్ , గోపి , ప్రేమ్ శేకర్, తదితరులు పాల్గొన్నారు.
Comment List