గొల్ల బాబూరావు గుండెల్లో దడ

వైసీపీ ప్రతినిధుల సభలో కొత్త అభ్యర్ధిని ప్రకటించే ఛాన్స్

On
గొల్ల బాబూరావు గుండెల్లో దడ

రేసులో ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ

golla 9

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.  ఆక్టోబర్ 9న జరిగే వైసీపీ ప్రజా ప్రతినిధుల సభ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది పార్టీ ముఖ్య నాయకులు పాల్గొనే వైసీపీ ప్రతినిధుల సభలో పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

అయితే సర్వేల్లో నెగటివ్ వచ్చిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోనున్నారు. వారిని తప్పించి.. వారి స్థానంలో కొత్త వారికి చోటు ఇస్తామనే సంకేతాలను జగన్ మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే తన భవిష్యత్ ఏంటో అర్ధంకాని పరిస్ఠితి నెలకొంది. టికెట్ రాదని తేలిపోవడంతో.. ఏం చేయాలో తెలియని అయోమయంలో గొల్ల బాబూరావు ఉన్నారు.

టీడీపీ, జనసేన అభ్యర్ధిని ఎదుర్కొవాలంటే బలమైన అభ్యర్ధి కావాల్సి ఉండటంతో ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ అయితే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉంది. అమ్మాజీని బరిలోకి దింపితే సింగిల్ హ్యాండ్ తో పార్టీ శ్రేణులను ఒక్కదారికి తేవడంతోపాటు..టీడీపీ జనసేన అభ్యర్ధిని ధీటుగా ఎదుర్కొంటారనే నమ్మకం ఉంది. అటు వైసీపీ కింది స్థాయి నాయకులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు.  దీంతో బాబూరావును తప్పించి ప్రతినిధుల సభ వేదికగా అమ్మాజీ పేరు ప్రకటించే అవకాశం ఉంది. 

Read More ఖేడ్ లో బీజేపీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి

Views: 159
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ