లారీని అపహరించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..
నిందితులు చౌహాన్ రవి, గుండె అశోక్, మజీద్ అలీ,
లారీ, ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం.. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు..
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై పార్కింగ్ చేసిన లారీని అపహరించిన సంఘటన జరిగింది. అపహరించిన లారీని విక్రయించేందుకు ప్రయత్నించగా ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తిరిగి విజయవాడకు తీసుకెళ్లి లారీ విడిభాగాలుగా చేసి విక్రయించి సొమ్ము చేస్తున్నామని వారిని తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ దగ్గర పోలీసులకు పట్టుపడ్డారు. ఆదివారం ఎల్బీనగర్ డిసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డిసిపి సాయి శ్రీ మాట్లాడుతూ ఆదిలాబాద్ కు చెందిన చౌహాన్ రవి(32), గుండె అశోక్(26), మజీద్ ఆలీ(29) కలసి నగరంలోని పహాడీషరీఫ్ పరిసర ప్రాంతాలలో ఉంటూ డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు సంపాదించాలనే దురాశతో పార్కింగ్ చేసిన లారీలను వనస్థలిపురం, ఆటోనగర్ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్నారు. అమ్మిన సొమ్ముతో లబ్ధిపొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా గత నెల 26న లారీని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం భారత్ బంక్ దగ్గర లారీ డ్రైవర్ పార్క్ చేసి వెళ్ళాడు. పార్క్ చేసిన లారీలు డ్రైవర్ వెళ్లిన విషయాన్ని గమనించినటువంటి చవాన్ రవి, గుండె అశోక్, మజీద్ అలీ ద్విచక్ర వాహనంపై వచ్చి లారీని విక్రయించేందుకు అదిలాబాదుకు తీసుకెళ్లారు. పార్క్ చేసిన లారీని అవగాహన గురైందని లారీ డ్రైవర్ యజమానికి సమాచారం అందించడంతో డ్రైవర్ సమాచారం వరకు లారీ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు లారీ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు లారీ ఆచూకీ కోసం డిఐ నిరంజన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. అపరిచిన లారీని ఆదిలాబాద్ నుండి విజయవాడకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఓఆర్ఆర్ దగ్గర లారీతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. లారీని తస్కరించిన వ్యక్తులను విచారించగా పార్క్ చేసిన లారీని తామేహ అపహరించామని ఆ లారీని ఆదిలాబాద్ కు తీసుకెళ్లి లారీకి కలర్ నెంబర్ ప్లేట్ మార్చి అమ్మకానికి పెట్టామని లారీ సేల్ కాకపోవడంతో తిరిగి విజయవాడలో లారీని విడిభాగాలుగా విడదీసి అమ్మేందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. లారీని దొంగలు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నాము, వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయల వరకు ఉంటుందని డిసిపి సాయి శ్రీ వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు, వనస్థలిపురం ఏసిపి భీమ్ రెడ్డి, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డిఐ నిరంజన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List