ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్స్. పాయకరావుపేటలో వైసీపీ మహిళా అభ్యర్ధి ఎవరంటే?
గొల్లబాబూరావుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత
విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వైఎస్ జగన్ ఏపీలో ఎన్నికలు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. వరుసగా నాలుగైదు నెలలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజల్లోకి చొచ్చుకుపోయి.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మార్చిలో ఎన్నికలు ఉంటాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. అయితే .. ఇంతకీ కొంతమంది ఎమ్మెల్యేల్ని మార్చ, యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీటిలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు సర్వేలను తెప్పించుకున్న హైకమాండ్.. గొల్ల బాబూరావు తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా వ్యతిరేకతతోపాటు.. సొంత పార్టీ కార్యకర్తలు కూడా బాబూరావును ఎండగట్టినట్లు తెలుస్తోంది. కాబట్టి ఎమ్మెల్యేను మార్చి. ఆ ప్లేస్లో మహిళా అభ్యర్ధిగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ, జనసేనను ఉమ్మడి అభ్యర్ధిని డీకొట్టాలంటే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న నాయకురాలు కావాల్సి రావడం.. ఇప్పటికే అమ్మాజీకి పాయకరావుపేటతోపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద బలగం ఉండటం.. వైసీపీకి కలిసి వస్తుందని అంటున్నారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్నిచేపట్టబోతున్నారు.. ఈ కార్యక్రమం తర్వాత అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List