ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించిన ప్రభుత్వం
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించిన ఎమ్మెల్యే ఆళ్ల
By Teja
On
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ నెల 6న నిర్వహించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. తన చివరి శ్వాస వరకు ప్రజల ఆరోగ్య కార్యకర్తగా పనిచేసిన కృపమ్మ మృతికి వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృపమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. మాజీ మంత్రి రాష్ట్ర ఎథిక్స్ చైర్మన్ మురుగుడు హనుమంతరావు, జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, తహసీల్దార్ ఎం.నాగిరెడ్డి, డిప్యూటీ కమిషనర్ బి. శివారెడ్డి చేతుల మీదగా ఎక్స్‌గ్రేషియాను అందజేశారు.
Views: 18
About The Author
Related Posts
Post Comment
Latest News
10 May 2025 19:56:45
సమాజ హిత "విజయ"గర్వం
సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ
సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ..
మే రెండవ ఆదివారం(ప్రపంచ...
Comment List