పాయకరావుపేటలో పాగా వేసేదెవరు?
పాయకరావుపేటలో వైసీపీ తరపున ఎవరు బరిలో నిలువబోతున్నారు.? ప్రస్తుత ycp ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతోంది. రేసులో ఎవరెవరు రేసులో ఉన్నారు?
పాయకరావుపేటలో వైసీపీ తరపున ఎవరు బరిలో నిలువబోతున్నారు.? ప్రస్తుత ycp ఎమ్మెల్యే గొల్ల బాబురావుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతోంది. రేసులో ఎవరెవరు రేసులో ఉన్నారు? ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ ఆత్మీయ భేటీలు.. నియోజకవర్గంలో పర్యటన ఉద్దేశ్యం ఏంటి? హైకమాండ్ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అమ్మాజీ క్లీన్ ఇమేజ్ వైసీపీని గట్టెక్కిస్తుందా? అన్ని వర్గాలతో అమ్మాజీకి ఉన్న సత్సంబందాలు వైసీపీకి బలం కాబోతున్నాయా?
రాజకీయాల్లో హాట్ సీట్ పాయకరావుపేట. ఎస్సీ నియోజకవర్గమైనా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై గ్రూపులు కట్టడం ఈ నియోజకవర్గంలో చాలా కామన్. అధికార వైసీపీ అయినా.. ప్రతిపక్ష టీడీపీ అయినా..ఒకటే. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై అసంతృప్తి రాగాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఏపీ ఎష్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు హైకమాండ్ అండదండలతోనే ఆమె నియోజకవర్గంలో ఆత్మీయ భేటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, వైసీపీ సీనియర్ నాయకులు దత్తుడు రాజు,
కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, గోవింద్ సహా పలువురు కీలకనేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామ సర్పంచ్ ల ఆత్మీయ భేటీలు నిర్వహించారు. టీడీపీ, జనసేన మధ్య టికెట్ వార్ తోపాటు.. ఆ రెండు పార్టీల్లో ఉన్న వర్గ పోరు అమ్మాజీకి ప్లస్ పాయింట్ గా మారుతుందని భావిస్తున్నారు. పెదపాటి అమ్మాజీ అయితే తమకూ అభ్యంతరం లేదని వైసీపీలో అందరూ ముక్త కంఠంతో చెప్తుండటం.. అమ్మాజీకి బలంగా మారింది. తన వర్గం వాళ్లు అధిక సంఖ్యల ఉండటం.. అమ్మాజీకి ఉన్న క్లీన్ ఇమేజ్.. ఈ సారి ఆమెకు టికెట్ వస్తే.. భారీ మెజార్టీ తప్పదని స్థానికులు భావిస్తున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List