మహిళలకు రక్షణగా రాచకొండ షీ టీమ్స్..
ఉమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ డిసిపి టి. ఉషా విశ్వనాథ్..
రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహాన్ ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరట్ పరిదిలో మహిళలను , యువతులను వేదింపులకు గురిచేస్తున్న 105 మందిని (మేజర్స్-58, మైనర్స్ -47) షీ టీమ్స్ వారు అరెస్టు చేసినారు. వారికి ఎల్బీనగర్ సిపి క్యాంప్ ఆఫీస్ (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు) లో కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
మహిళలకు రక్షణగా రాచకొండ షీ టీమ్స్..
ఉమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ డిసిపి టి. ఉషా విశ్వనాథ్..
ఎల్బీనగర్, అక్టోబర్ 12: పదిహేను రోజుల్లో 105 మంది ఆకతాయిలను పట్టుకున్న రాచకొండ షీ టీమ్స్. మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉషా విశ్వనాథ్ తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ.. వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నామని అన్నారు.
రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహాన్ ఆదేశానుసారం, రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. రాచకొండ కమిషనరట్ పరిదిలో మహిళలను , యువతులను వేదింపులకు గురిచేస్తున్న 105 మందిని (మేజర్స్-58, మైనర్స్ -47) షీ టీమ్స్ వారు అరెస్టు చేసినారు. వారికి ఎల్బీనగర్ సిపి క్యాంప్ ఆఫీస్ (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు) లో కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
గత నెల సెప్టెంబర్ 1 నుండి 15 వరకు 81 పిర్యాదులు అందినాయని, ఉమెన్ సేఫ్టీ వింగ్ రాచకొండ డిసిపి టి. ఉషా విశ్వనాథ్ తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన పిర్యాదులలో ఫోన్ల ద్వారా వేదించినవి -21, వాట్సప్ కాల్స్ & మెసేజల ద్వారా వేదించినవి -24, సోషల్ మీడియా ద్వారా వేదించినవి- 19, నెరుగా వేదించినవి – 17, వాటిలో క్రిమినల్ కేసులు -11, పెట్టి కేసులు -38, కౌన్సెల్లింగ్ - 32 కేసులు నమోదు చేశామన్నారు.
*ముఖ్యమైన కేసులు..!*
*మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్టు..*
ఉప్పల్ ప్రాంతంలో నివాసముండే మైనర్ బాలిక 10వ తరగతి చదువుతున్న సమయంలొ తన బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు ఆమెకు దూరపు బంధువు అయిన నిందితుడు పరిచయం అయ్యడు. కొద్ది రొజుల తరువాత ఆ మైనర్ బాలికను పెళ్లిచేసుకుంటను అని నమ్మించి, మాయ మాటలతో లొబర్చుకొని శారీరకంగా కలిసి అట్టి సమయలొ అమెకు తెలియకుండ ఫొటొలు, వీడియోలు తీసినాడు. తరువాత అతను చెప్పినట్లు వినకుంటే వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలొ బందువులకు, స్నేహితులకు పంపుతానని బెదిరించాడు. ఇట్టి విషయమై ఉప్పల్ పోలీసు స్టేషన్ నందు క్రీనల్ కేసు నమోదు చేసి, నేరస్తున్ని అరెస్టు చేసి జైలుకి పంపడం జరిగింది.
*ఇన్‌స్టాగ్రామ్ లో బాలికలను వేదిస్తున్న వ్యక్తి అరెస్టు..*
మహేశ్వరం ఏరియాలో ఉంటున్న అక్క చెల్లెళ్ళుకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నూడ్ వీడియోలు పంపి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్ డిపి నుండి ఫోటోలు తీసుకొని మోర్ఫింగ్ చేసి నూడ్ వీడియొలుగా మార్చి, బాదితురాళ్లకు, వారి బందువులకు వీడియోలను సోషల్ మీడియాలో ద్వారా పోస్ట్ చేస్తాడు. వెంటనే బాడితురాలు షీ టీమ్ ఇబ్రహీంపట్నం వారిని సంప్రదించగ, అట్టి విషయమై మహేశ్వరం పోలీసు స్టేషన్ నందు క్రీనల్ కేసు నమోదు చేసి, నేరస్తున్ని అరెస్టు చేసి జైలుకి పంపడం జరిగింది.
*మధ్యం మత్తులో స్కూల్ విద్యార్థినిని వేధిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకున్న: షీ టీమ్*
చౌటుప్పల్ లోనీ స్థానిక మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులను ఇద్దరు వ్యక్తులు మధ్యం సేవించి బీరు సీసాలు పట్టుకొని స్కూల్ వద్దకు వచ్చి వేదిస్తుండగా, అక్కడే డెకోయ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి షి టీమ్ చౌటుప్పల్ వారిని అదుపులో తీసుకొని వారిపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
*మెట్రోట్రైన్లో డెకాయ్ ఆపరేషన్...*
రాచకొండ షీ టీమ్స్ మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్స నిర్వహించి, మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళి ప్రయాణిస్తున్న (04) మందిని పట్టుకుని మెట్రో స్టేషన్ ఆదికారుల ద్వారా ఫైన్ వేయించడం జరిగింది.
*డెకాయ్ ఆపరేషన్..*
షీటీమ్ కుషాయిగూడ, కుషాయిగూడ ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి రోడ్డు మీద వెలుతున్న మహిళను, ఆడపిల్లలను వేదిస్తు ఇబ్బందులకు గురిచెస్తున్న 11 మంది పోకిరిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది. అలాగే వనస్థలిపురం, మల్కాజ్గిరి ఏరియాలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మహిళను, ఆడపిల్లలను వేదిస్తు ఇబ్బందులకు గురిచెస్తున్న పోకిరిలను 6 మంది చొప్పున అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ చేయడం జరిగింది.
ఆడవారికి ఎదురయ్యే భౌతిక పరమైన దాడులు, లైంగిక వేదింపులు, ప్రయాణ సమయాల్లో వేదింపులు వంటి ఇబ్బందుల నుంచి రక్షించేందుకు రాచకొండ పోలీసులు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు. పురుషులు, సాటి ఆడవారి పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలవాలని, పలు రకాల అవసరాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదన్నారు. స్త్రీలను గౌరవించడం తమ వ్యక్తిత్వంలో భాగం కావాలని, ఆడవారిని ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించేది లేదని, అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు వేదింపులకు గురి అయినప్పుడు వెంటనే షీ టీమ్స్ రాచకొండ వాట్సప్ నెంబర్ 8712662111 ద్వారా , లేదా ప్రాంతాల వారిగా భువనగిరి - 8712662598, చౌటుప్పల్ - 8712662599, ఇబ్రహీంపట్నం - 8712662600, కుషాయిగూడ - 8712662601, ఎల్బీనగర్ - 8712662602, మల్కాజ్గిరి - 8712662603, వనస్థలిపురం - 8712662604 నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డిసిపి టి. ఉషా విశ్వనాథ్, ఎసిపి వెంకటేశం, ఇన్స్పెక్టర్ పరశురాం, అడ్మిన్ ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List