131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

On
131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

IMG_20231013_214647
నిందితుడు గోడిక్య దినేష్

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ తక్కువ ధరకు గోవాలో మద్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిఐజి శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు సరూర్నగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిభిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ టి రవీందర్రావు సూచనల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ బి. హనుమంతరావు నేతృత్వంలో సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు మల్లాపూర్ లో గల ఒక ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గోవాకు సంబంధించిన 131 రాయల్ స్టాగ్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి గోడిక్య దినేష్ ను విచారించగా తాను అ బాటిళ్లను గోవాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 1.20 లక్షల రూపాయల ఉంటుందని ప్రొహిభీషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ లు ముజాహిద్ సుతరి, ఇబ్రహీం పాషా, కె. సామాజ, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 42

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.