గాజా నుంచి 4 లక్షలకు పైనే తరలివెళ్లిన పాలస్తానియులు

హమాస్‌ మిలిటెంట్లను మట్టుపెట్టేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌

By Teja
On
గాజా నుంచి 4 లక్షలకు పైనే తరలివెళ్లిన పాలస్తానియులు

గాజా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించిన ఇజ్రాయెల్

పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 600 చిన్నారులతో 1,900 పాలస్తీన్లు, సహా మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్‌ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృత్యువాతపడ్డారు.

తాజాగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇ‍జ్రాయెల్‌ సైన్యం ఆదేశించడంతో ఇక్కడి పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాజాలో కరెంట్‌, మంచి నీళ్లు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న అక్కడి పౌరులు ఇజ్రాయెల్‌ ఆదేశాలతో మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వేలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ నడకన సౌత్‌ గాజాకు తరలివెళ్తున్నారు.

ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస  
ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్‌ ఇజ్రాయెల్‌కు సూచించారు.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు
గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్‌ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకోడంతో  ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇటు హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను దక్షిణ ప్రాచ్చంలోని దేశాలు ఖండిస్తున్నాయి. బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్  బహ్రెయిన్‌లో పాలస్తీనియన్లకు భారీగా మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా నిరసలను వ్యక్తం చేస్తున్నారు. AP23280581439909-1696697043

Views: 53

About The Author

Post Comment

Comment List

Latest News

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు
        నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్లు. లేబర్ కోడ్ ల రద్దుకై 23 మహ.బాద్ లో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.    ఐఎఫ్ టియు
కాంగ్రెస్ విజయం
నీట్ పరీక్ష రద్దు చేయండి
రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు