విద్యుత్ మాయాజాలం అసలు కంటే కొసరే ఎక్కువ

By Khasim
On
విద్యుత్ మాయాజాలం    అసలు కంటే  కొసరే ఎక్కువ

యర్రగొండపాలెం పట్టణంలో స్థానికంగా  ఉంటూ చిరు వ్యాపారం నిర్వహించుకునే ఒక వ్యక్తి కి ఈనెల 10వ తేదీన వచ్చిన కరెంటు బిల్లును చూసి ఖంగుతిన్నాడు.. దాదాపు 84460 రూ.. వచ్చింది. ప్రతినెల తాను కరెంట్ బిల్లు చెల్లిస్తున్నప్పటికీ ఇంత  మొత్తంలో రావడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.ఈ విషయమై విద్యుత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో 
వేచి చూడాలి? యర్రగొండపాలెం మండలంలో తెలిసి ఇదొక్కటే తెలియక ఇంకా ఎన్ని అధికంగా వచ్చిన కరెంటు బిల్లులు ఉన్నాయో  వాళ్ళకే  తెలియాలి?  వచ్చిన కరెంటు బిల్లులను ఏ మేరకు తగ్గించి వినియోగదారుల పై భారం పడకుండా చూస్తున్నారో   చెప్పవలసిన బాధ్యత వారి పై ఉంది...
వాస్తవంగా విద్యుత్ బిల్లులు  ప్రజలకు షాక్ కొడుతున్నాయి.పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారు అనడానికి .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 7 రకాల చార్జీల పేరుతో ప్రజల కళ్ళుగప్పి కోట్ల రూపాయలును ప్రజల నెత్తిన మోపారని అని తెలియజేయడానికి ... విద్యుత్ మాయాజాలంతో అసలు చార్జీలకంటే  కొసరు చార్జీలు ఎక్కువయ్యాయని నిరూపించడానికి ... విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని  చూపించడానికి ఈ ఒక్క ఉదాహరణ సరితూగుతుంది..
రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ భారాలు - సంస్కరణలపై ఈ నెల 12వ తేదీన సిపిఐ వామపక్షాల పార్టీలు మండలం లో  ప్రజా బ్యాలెట్ నిర్వహించి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే  పరిస్థితి
ఎంత తీవ్రంగా ఉందో  అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రజలకు 
ఎంతైనా ఉంది?IMG-20231014-WA0456

Views: 74

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన* కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
జై శ్రీమన్నారాయణ,వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల...
కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో   *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
పెద్దకడుబూరులో భారీ వర్షం - ఈ వర్షం మంచికే సంకేతం...!
నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు‌‌..
ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...
పెద్దకడుబూరులో శరన్నవరాత్రులు శ్రీ శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు...!